News April 12, 2025
ఇంటర్లో ఫలితాల్లో పల్నాడు జిల్లాకు 23వ స్థానం

రాష్ట్ర స్థాయిలో ఇంటర్ పరీక్షా ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి పల్నాడు జిల్లా 23వ స్థానంలో నిలిచింది. వివరాలను జిల్లా అధికారి నీలావతి దేవి శనివారం వివరించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలలో 40% ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 23వ స్థానంతో పల్నాడు జిల్లా సరిపెట్టుకుంది. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 71% ఉత్తీర్ణతతో 9వ స్థానాన్ని సాధించిందన్నారు.
Similar News
News October 17, 2025
ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: BRS

TG: చట్టపరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని BRS డిమాండ్ చేసింది. పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామంటే ఒప్పుకునేదే లేదని ఆ పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. CM రేవంత్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రేపు తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి బీసీ బంద్‌లో పాల్గొంటామని తెలిపారు.
News October 17, 2025
APPLY NOW: పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు..

పవర్‌గ్రిడ్‌లో 20 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. CA/ICWA ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష(CBT),ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.powergrid.in/
News October 17, 2025
టైర్ పేలి దగ్ధమైన బస్సు.. 29 మంది క్షేమం

అనంతపురం (D) గార్లదిన్నె మం. తలగాచిపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి రాయచూర్‌లోని దేవదుర్గకు వెళ్తుండగా మార్గమధ్యలో బస్సు టైర్ పగిలింది. మంటలు ఎగిసి పడటంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. ఎస్సై మహమ్మద్ గౌస్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.