News January 27, 2025
ఇంటర్ ఎగ్జామ్స్: మేడ్చల్ జిల్లాలో 1,26,423 విద్యార్థులు

మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లాలో ఇంటర్లో మొత్తం 1,26,423 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తన ఛాంబర్లో సమావేశంలో నిర్వహించారు. పరీక్ష విధి విధానాలు, చర్యలపై చర్చించారు.
Similar News
News December 13, 2025
భూపాలపల్లిలో నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

జిల్లాలో మామునూరు, చొప్పదండి నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. భూపాలపల్లి జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 253 మందికి 181 మంది (హాజరు 72.01), కాటారం జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 198 మందికి 133 మంది హాజరైనట్లు డీఈఓ ఎం.రాజేందర్ తెలిపారు. మొత్తం 137 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
News December 13, 2025
సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒత్తిడి దూరం

సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ఒత్తిడి దూరమవుతుందని నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. పట్టణంలోని SDR పాఠశాలలో 11వ వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఒకే వేదికపై విభిన్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సీఐ కృష్ణమూర్తి, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
News December 13, 2025
వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


