News March 5, 2025

ఇంటర్ ఎగ్జామ్.. HYDలో భారీగా ట్రాఫిక్

image

ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. చింతల్ బస్టాండ్ నుంచి రిడ్జ్ టవర్స్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సైతం ఈ ట్రాఫిక్‌లో చిక్కుకోవడం గమనార్హం. సంబంధిత అధికారులు ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఎగ్జామ్ సమయంలో ప్రధాన సర్కిళ్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News February 17, 2026

HYD: పెళ్లైంది సరే.. ఆ ‘డబుల్ డ్యూటీ’ సంగతేంటి?

image

‘ఆఫీసులో ఫైళ్లు.. ఇంట్లో గిన్నెలు.. ఈ నరకం ఎన్నాళ్లు’.. కొత్తగా పెళ్లైన ఐటీ ఉద్యోగినుల ఆవేదన ఇది. సమానత్వం అని మాటల్లో చెబుతున్నా ఇంటి బాధ్యతలు మాత్రం ఇంకా ఆడవారికే అప్పజెప్పుతున్నారు. అత్తమామల నిఘా, ఇంటి పనుల భారం భరించలేక ఆఫీసునే ఒక ‘సేఫ్ జోన్’గా భావిస్తున్నారు. అందుకే ఇంటికి త్వరగా వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పని ఒత్తిడి కంటే ఈ ‘రోల్ ఓవర్‌లోడ్’ యువతను ఇంటికి దూరం చేస్తోంది.

News February 17, 2026

సైబరాబాద్: 76 వార్డుల్లో సెటిలర్ల ‘సైలెంట్’ సునామీ!

image

కొత్తగా ఏర్పడిన CYB కార్పొరేషన్ (CMC) ఇప్పుడు 76 వార్డులతో IT బెల్ట్‌లో తన పట్టు చాటుతోంది. ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా ఆంధ్ర, నార్త్ ఇండియన్ సెటిలర్ల ఓట్లపైనే ఆధారపడి ఉన్నాయి. గత పోల్స్‌లో BRS తన పాత కోటను కాపాడుకోవాలని చూసినా అధికార కాంగ్రెస్ తన ‘డెవలప్‌మెంట్’ కార్డుతో సెటిలర్లను ఆకట్టుకుంది. ఇక్కడ <<19167954>>మజ్లిస్<<>> ప్రభావం లేకపోవడంతో ఫైట్ అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ-బీఆర్ఎస్ మధ్యే సాగుతోంది.

News February 17, 2026

GHMC: మజ్లిస్ ‘కోట’.. 150 వార్డుల్లో పాతబస్తీ పవర్!

image

​హైదరాబాద్ విభజన తర్వాత కూడా GHMC తన 150 వార్డుల బలాన్ని కాపాడుకుంది. అయితే, వెస్ట్రన్. ఈస్ట్రన్ జోన్లు విడిపోవడంతో ఇప్పుడున్న GHMCలో మజ్లిస్ (MIM) ఓటు బ్యాంక్ కాన్సంట్రేషన్ అమాంతం పెరిగింది. శంషాబాద్, రాజేంద్రనగర్ ఏరియాలు కలిసినా కోర్ సిటీలో మజ్లిస్ తిరుగులేని ‘డిసైడింగ్ ఫ్యాక్టర్’గా మారింది. మేయర్ పీఠం దక్కాలంటే ఏ పార్టీకైనా మజ్లిస్ అండ ఉండాల్సిందే. విభజన తర్వాత మజ్లిస్ బలం మరింత పెరిగింది.