News January 28, 2025
ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సోమవారం అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు బందోబస్తు నిర్వహించాలని పేర్కొన్నారు. జిరాక్స్ సెంటర్లను బంద్ చేయాలన్నారు. వైద్య, మంచి నీటి వసతులు కల్పించాలని సూచించారు.
Similar News
News November 28, 2025
నంద్యాల: ‘సమగ్ర ఓటర్ల జాబితా రూపకల్పనకు చర్యలు’

జిల్లాలో స్పష్టమైన, సక్రమమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి సమగ్ర చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్కు వివరించారు. విజయవాడలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్తో పాటు డీఆర్ఓ రాము నాయక్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
News November 28, 2025
శ్రీకాకుళం: వర్షాలపై అప్రమత్తం.. ధాన్యం సేకరణపై దృష్టి

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
News November 28, 2025
DEC 14 నుంచి ఉచిత సివిల్స్ కోచింగ్: మంత్రి సవిత

BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో DEC 14 నుంచి నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్ను నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. విజయవాడ గొల్లపూడిలోని కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి, ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 100మందికి ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పిస్తామని, దరఖాస్తులను DEC 3వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. DEC 7న అర్హత పరీక్ష నిర్వహించి, 11న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి చెప్పారు.


