News February 3, 2025
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ లకు డీటీలకు కేటాయించాలని ఆదేశించారు.
Similar News
News February 28, 2026
MDK: శాంతి భద్రతల భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా మార్చి 1 నుంచి 31 వరకు పోలీసు యాక్ట్ 1861 సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిషేధమన్నారు. చట్టవ్యతిరేక చర్యలు, ఆస్తి నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News February 28, 2026
275 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 28, 2026
పెద్దపల్లి: 80 మంది విద్యార్థులు గైర్హాజరు

పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 4,748 మంది విద్యార్థులకు గాను 4,668 మంది హాజరయ్యారని, 98 శాతం హాజరు నమోదైనట్లు వివరించారు. సుమారు 80 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.


