News March 2, 2025
ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ నెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News March 17, 2025
మీడియా గొంతు విప్పి రేవంత్ అక్రమాలపై మాట్లాడాలి: KTR

TG: జర్నలిస్టులను రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని KTR అన్నారు. CMను విమర్శిస్తూ వీడియోలను పోస్ట్ చేసి జైలుపాలైన మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రేవతి, తన్వికి జరిగిందే రేపు మిగతా జర్నలిస్టులకూ జరగొచ్చు. మీడియా గొంతు విప్పి రేవంత్ అక్రమాలపై మాట్లాడాలి’ అని పేర్కొన్నారు. కాగా రేవతి, తన్వికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
News March 17, 2025
వికారాబాద్‌లో NCCని ఏర్పాటు చేయండి: ఎంపీ

వికారాబాద్‌లో NCC యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్‌కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతమైన తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు NCC యూనిట్‌ను వికారాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందన్నారు.
News March 17, 2025
BREAKING: ఫలితాలు విడుదల

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు ప్రొవిజన్ సెలక్షన్ లిస్టును TGPSC విడుదల చేసింది. 574 మంది పోస్టులకు ఎంపికైనట్లు వివరించింది. 581 పోస్టులకు TGPSC పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. లక్షా 45 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు.