News February 28, 2025

ఇంటర్ పరీక్షలపై నేడు శిక్షణ

image

మార్చి 3 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలపై రూట్ ఆఫీసర్లకు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపర్‌వైజర్లకు, డిపార్ట్మెంట్లకు నేడు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో సెయింట్ అంథోని పాఠశాల ఉదయం శిక్షణ కార్యక్రమం ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ తెలిపారు.

Similar News

News October 31, 2025

ADB: శిశు మరణాల నివారణకు పని చేయాలి

image

ఆదిలాబాద్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన నవజాత శిశు సంరక్షణ శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, మెమొంటోలను అందజేశారు. శిశు మరణాల నివారణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News October 31, 2025

అరకు అందాల సీజన్‌కు ప్రత్యేక రైళ్లు

image

అరకు వెళ్లేందుకు అరకు-యెలహంకా (బెంగళూరు) మధ్య 4 ప్రత్యేక రైళ్లు నడపనున్నాయి.
☆ 08551/52 అరకు-యెలహంకా స్పెషల్ ట్రైన్
☞ అరకు నుంచి బయలుదేరు తేదీలు: నవంబర్ 13, 23
☞ యెలహంకా నుంచి తిరుగు ప్రయాణ తేదీలు: నవంబర్ 14, 24
☆ 08555/56 అరకు-యెలహంకా స్పెషల్ ట్రైన్
☞ అరకు నుంచి బయలుదేరు తేదీలు: నవంబర్ 17, 24
☞ యెలహంకా నుంచి బయలుదేరు తేదీలు: నవంబర్ 18, 25
☞ ఈ రైళ్లు ధర్మవరం, సత్యసాయి ప్రశాంతి నిలయంలో ఆగనున్నాయి.

News October 31, 2025

సూర్యలంక సముద్ర స్నానాలపై నిషేధం: CI

image

బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో సముద్ర స్నానాలపై నిషేధం కొనసాగిస్తున్నట్లు మెరైన్ సీఐ లక్ష్మారెడ్డి గురువారం తెలిపారు. తుపాను ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర తీరంలోకి టూరిస్టులు, భక్తుల ప్రవేశం నిషేధించినట్లు వివరించారు. భక్తులు గమనించి అధికారులు ప్రకటించే వరకు ఎవరూ తీరానికి రావద్దని సూచించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.