News March 5, 2025
ఇంటర్ పరీక్షలు.. జిరాక్స్ సెంటర్లు క్లోస్ : ASF సీఐ

ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆసిఫాబాద్ సీఐ రవీందర్ ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి మార్చి 25 వరకు ఉదయం నుంచి 12:30ల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షలు రాస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు అసిఫాబాద్ సీఐ అల్ ది బెస్ట్ చెప్పారు.
Similar News
News November 27, 2025
MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
News November 27, 2025
పన్నూర్: డాక్యుమెంట్లు లేకుంటే రసీదు ఇవ్వాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సమయంలో అభ్యర్థులు ఏదైనా డాక్యుమెంట్ సమర్పించని పక్షంలో, ఆ వివరాలు, గడువుతో కూడిన రసీదు తప్పనిసరిగా అందించాలని రామగిరి మండలం పన్నూరులో కలెక్టర్ తెలిపారు. పన్నూరులోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్.. ప్రతి నామినేషన్ను టీ-పోల్లో నమోదు చేయాలని, అలాగే ఓటర్ జాబితాలో అభ్యర్థి పేరును క్రాస్ చెక్ చేసుకోవాలని అధికారులకు సూచించారు.
News November 27, 2025
SKLM: బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేర్పులు, మార్పులు పూర్తి చేయాలి

8 నియోజకవర్గాల్లో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఓటర్ లిస్టులో చేర్పులు, మార్పులు, దిద్దుబాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల్లో గల EROలు, AEROలతో మాట్లాడి ఫారం 6,7,8లకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం సూచించిన ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి నివేదికలు అందించాలన్నారు.


