News February 25, 2025
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: బాపట్ల కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపర్డెంట్లలతో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి వీక్షణ సమావేశం నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుతాయని ఆయన అన్నారు. జిల్లాలో 36 సెంటర్లలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Similar News
News November 26, 2025
తెంబా బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడు

SA క్రికెట్లో అద్భుతమైన నాయకుడిగా తనదైన ముద్ర వేస్తున్న కెప్టెన్ తెంబా బవుమా ఇప్పుడు కొత్త సంచలనాలను నమోదు చేస్తున్నారు. 27ఏళ్ల తర్వాత తన జట్టుకు తొలి ICC టైటిల్ అందించిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్గా ఆయన నిలిచిన విషయం తెలిసిందే. తాజా సిరీస్ విజయంతో 25ఏళ్ల తరువాత భారత్లో టెస్ట్ సిరీస్ గెలిపించిన కెప్టెన్ అయ్యారు. 12 మ్యాచ్ల్లో 11 విజయాలు, 1 డ్రాతో విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా ఉన్నారు.
News November 26, 2025
ASF: డిజిటల్ వివరాలను టీ పోల్లో నమోదు చేయాలి

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు ఆదేశాలు, సూచలను జారీచెశారు. పోలింగ్ క్రేంద్రాల జాబితా, డిజిటల్ వివరాలను టీ పోల్లో నమోదు చేయాలన్నారు.
News November 26, 2025
పెబ్బేరు: రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడి మృతి

పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేష్, అతని అల్లుడు ప్రవీణ్ బైక్పై రంగాపురం నుంచి పెబ్బేరుకు వస్తుండగా బైపాస్ వద్ద హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు రమేష్కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.


