News February 25, 2025
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: బాపట్ల కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. సోమవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపర్డెంట్లలతో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి వీక్షణ సమావేశం నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుతాయని ఆయన అన్నారు. జిల్లాలో 36 సెంటర్లలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Similar News
News March 22, 2025
HYD: పదోన్నతి.. ఇంతలోనే అడిషనల్ DCP మృతి

హయత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అడిషనల్ DCP బాబ్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పోలీస్ సిబ్బంది తీవ్ర సంతాపం ప్రకటించింది. మార్చి 18న ఆయన అడిషనల్ SP ర్యాంక్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ఇంతలోనే మృతి చెందడం కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద అంబర్‌పేటలో నివాసం ఉండే బాబ్జీకి ఉదయం వాకింగ్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే హైవే మీద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టింది.
News March 22, 2025
భార్య నుంచి ఆ కాల్ వస్తే చాలా టెన్షన్: అభిషేక్ బచ్చన్

‘ఐ వాంట్ టు టాక్’ అనే సినిమాకు ‘ఉత్తమ నటుడు’ పురస్కారం అందుకున్న సందర్భంగా నటుడు అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఐ వాంట్ టు టాక్’ అని ఎవరి కాల్ వస్తే మీరు టెన్షన్ పడతారంటూ హోస్ట్ అర్జున్ కపూర్ ప్రశ్నించగా.. తన భార్య నుంచి ఆ కాల్ వస్తే సమస్యలో పడ్డట్లేనని అభిషేక్ జవాబిచ్చారు. ఐష్, అభిషేక్ విడిపోనున్నారని గత కొంతకాలంగా వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
News March 22, 2025
సిరిసిల్ల జిల్లాలో ఎండలు కొడుతూనే వర్షాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు ఎండలు కొడుతూనే మరోవైపు పలు మండలాలలో వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదు అయ్యాయి. వీర్నపల్లి 37.6°c, ఇల్లంతకుంట 37.6°c, తంగళ్ళపల్లి 37.5°c, గంభీరావుపేట 37.5°c, సిరిసిల్ల 37.4 °c,చందుర్తి 37.2°c, వేములవాడ 37.1°c, ఎల్లారెడ్డిపేట 35.8 °c లుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.