News March 5, 2025

ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి

image

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష కేంద్రాలను బుధవారం అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తనిఖీ చేపట్టారు. వశిష్ట, సందీపని కళాశాలలోని పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లోని వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

Similar News

News December 7, 2025

ఈ మంత్రం శని దోషాన్ని తగ్గిస్తుంది

image

సూర్యపుత్రో దీర్ఘదేహః విశాలక్ష శ్శివప్రియ:|
మందచార: ప్రసన్నాత్మా పీడాం దహతు మే శని:||
శన్యారిష్టే తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్|
శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే||
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|
చాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం||
నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే|
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయచ నమోస్తుతే||

News December 7, 2025

ఊరు విడిచినా ఉలవఅడుగు విడువరాదు

image

ఒక వ్యక్తి తాను పుట్టి పెరిగిన ఊరిని వదిలి వెళ్లినా, అక్కడ ఉండే అనుబంధాలను, తన మూలాలను, వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. తన సొంత మూలాలను, సంస్కృతిని, తన వ్యక్తిగత గుర్తింపును గౌరవించాలి, కాపాడుకోవాలి. అవే మన ప్రవర్తనను మరియు జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. ఈ సామెత మనిషి జీవితంలో సొంత ఊరు, మూలాల ప్రాముఖ్యతను, అవి ఇచ్చే విలువల గురించి తెలియజేస్తుంది.

News December 7, 2025

కొడంగల్: అభ్యర్థులకు కోవర్టుల టెన్షన్..?

image

పంచాయతీ ఎన్నికల సమరం వేళ, ప్రధాన పార్టీల అభ్యర్థులకు ‘కోవర్టుల’ సమస్య గుబులు పుట్టిస్తోంది. పార్టీల్లో అత్యంత రహస్యంగా చర్చించుకున్న వ్యూహాలు క్షణాల్లో ప్రత్యర్థులకు చేరుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాము మాట్లాడుకున్న విషయాలు లీకవుతుండటంతో ప్రత్యర్థులు వెంటనే అప్రమత్తమై ప్రణాళికలు మార్చుకుంటున్నారు. ఈ ‘లీకు వీరుల’ వ్యవహారంతో నాయకులు ఎవరు నమ్మకస్తులో తెలియక తర్జనభర్జన పడుతున్నారు.