News March 5, 2025
ఇంటర్ పరీక్ష వేళ పరిసరాల జిరాక్స్ సెంటర్ల బంద్ చేయాలి: సీపీ

ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండవద్దని సీపీ అంబర్ కిషోర్ ఝా అదేశించారు. ఎగ్జామ్కు హాజరయ్యే విద్యార్థులతో పాటు ఇన్విజిలెటర్ల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్ర పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News November 20, 2025
గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ నిన్న దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు.
News November 20, 2025
గ్రామాల్లో నేటి నుంచి చీరలు పంపిణీ

జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలు, యువతులకు నేటి నుంచి చీరలను పంపిణీ చేయనున్నారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొదటి విడతగా గ్రామాల్లో గురువారం నుంచి పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలో 3,66,532 మంది సభ్యులు ఉన్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 9 వరకు కొనసాగనుంది.
News November 20, 2025
ఎమ్మెల్యేల ఫిరాయింపు.. MLA గాంధీ న్యాయవాదుల విచారణ

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే పార్టీ ఫిరాయింపు విచారణకు సంబంధించి ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నేడు అసెంబ్లీ కార్యాలయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లు తమ వాదనలు వినిపిస్తారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో ఆరుగురి విచారణ ముగిసింది.


