News March 5, 2025

ఇంటర్ పరీక్ష వేళ పరిసరాల జిరాక్స్ సెంటర్ల బంద్ చేయాలి: సీపీ

image

ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో పరీక్ష కేంద్రాల సమీపంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉండవద్దని సీపీ అంబర్ కిషోర్ ఝా అదేశించారు. ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులతో పాటు ఇన్విజిలెటర్ల వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్ర పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News February 11, 2026

నల్గొండ: ఇవాళ సెలవు

image

నల్గొండతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల పరిధిలోని అన్ని బ్యాంకులకు బుధవారం సెలవు ప్రకటించినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ తెలిపారు. గురువారం యథా విధిగా బ్యాంకులు పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఫిబ్రవరి 11న ప్రత్యేక సాధారణ సెలవు దినాన్ని వినియోగించుకుని తమ ఓటు వేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు.

News February 11, 2026

సిద్దిపేట: రేపు జిల్లా సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక: DYSO

image

సీఎం కప్ 2025 (2వ ఎడిషన్)లో భాగంగా జిల్లా సాఫ్ట్‌బాల్ పురుషుల, మహిళల జట్ల ఎంపికను ఈ నెల 13న నిర్వహించనున్నారు. సిద్దిపేట సెయింట్ పాల్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ ఎంపికలు జరుగుతాయని డీవైఎస్ఓ (DYSO) వెంకట నర్సయ్య తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు తమ దరఖాస్తులతో హాజరు కావాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News February 11, 2026

హరిత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వరంగల్ ఆర్డీఓ

image

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘హరిత’ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఆర్డీఓ టి.సుమ బుధవారం సందర్శించారు. పర్యావరణ హితంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన ఈ కేంద్రాన్ని చూసి ఆమె ముగ్ధులయ్యారు. పోలింగ్ సరళిని అధికారులతో కలిసి సమీక్షించిన అనంతరం, హరిత పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ దగ్గర సహచర అధికారులతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు.