News May 21, 2024
‘ఇంటర్ ప్రవేశాలకు 23న స్పాట్ కౌన్సిలింగ్’
భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి తుమికి వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు మే 23న భద్రాచలం గిరిజన గురుకుల స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ గ్రూపులలో మిగిలిన సీట్లభర్తీకై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News December 3, 2024
ఎంపీ వద్దిరాజు ఉప రాష్ట్రపతితో సమావేశం
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ తో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా రాజ్యసభలోని ఛైర్మన్ ఛాంబర్ కు ఎంపీ రవిచంద్ర సోమవారం ఉదయం వెళ్లి ధనఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతితో రాజ్యసభ సభ్యుడు పలు అంశాలపై చర్చించారు.
News December 2, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు
∆} ఖమ్మం:ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు∆}ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ఎన్నో చర్యలు: భట్టి∆}సత్తుపల్లి: కారు బీభత్సం.. తప్పిన ప్రమాదం∆} కొత్తగూడెం:బాధితుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి:ఎస్పీ∆} పినపాక:అన్నం పెట్టే రైతును సుభిక్షంగా చూస్తాం: ఎమ్మెల్యే∆}గ్యారంటీల అమలు కోసం బిజెపి ఉద్యమాలు చేస్తుంది: శ్రీధర్ రెడ్డి∆} అశ్వాపురం: పేకాట స్థావరంపై పోలీసుల దాడి
News December 2, 2024
రామయ్య దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
పోలి పాడ్యమి సందర్భంగా రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులతో భద్రగిరి పోటెత్తింది. గత నెల రోజుల నుండి కార్తీక మాసం సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈ రోజు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులందరికీ స్వామి వారి తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద అవకాశాన్ని కల్పించామన్నారు.