News September 30, 2024
ఇంటర్ ప్రవేశాల గడువు అక్టోబర్ 15 వరకు పొడిగింపు
2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో ప్రవేశాల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు వనపర్తి డిఐఈఓ అంజయ్య ఆదివారం తెలిపారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలో రూ.500 జరిమానాతో, ప్రభుత్వ కళాశాలలో ఫైన్ లేకుండా అక్టోబర్ 15 వరకు ఇంటర్ లోప్రవేశం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని అన్నారు.
Similar News
News October 5, 2024
అమ్రాబాద్: గద్దర్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలి
అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే గద్దర్ విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయాలని బల్మూర్ మండల అంబేడ్కర్ యువజన సంఘం నాయకుడేు గోరటి అశోక్ కోరారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ప్రధానవక్తలుగా కంచ ఐలయ్య, ఏపూరి సోమన్న, గద్దర్ కూతురు వెన్నెల రానున్నారని ప్రజా సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు.
News October 5, 2024
అలంపూర్ నూతన పాలక మండలిపై ఆశలు..?
శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాల నూతన పాలక మండలితో ఆలయ అభివృద్ధి జరుగుతుందా అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆలయంలో ప్రధాన సమస్యలు.. భక్తులు తమ సామన్లు పెట్టుకోవడానికి లాకర్ సౌకర్యం అందుబాటులో లేదు, అన్నదాన సత్రం ఇరుకుగా ఉంది, ఆలయాల ప్రాంగణంలో భక్తులు సేద తీరడానికీ నిలువు నీడ సౌకర్యం లేదు, ఆలయాలకు పార్కింగ్ వేలం పాట ద్వారా రూ. లక్షల ఆదాయం వస్తున్నా.. వాహనాలు ఎండలో ఉండాల్సిన పరిస్థితి.
News October 5, 2024
జూరాలలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి
జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో శుక్రవారం 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ సూరిబాబు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 196 మెగావాట్లు, 229.586 ఎం యూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు 204.994 ఎంయూ ఉత్పత్తిని చేపట్టామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 434.580 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.