News September 11, 2024

ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు

image

ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు వరంగల్, హనుమకొండ డీఐఈవోలు ఎ.గోపాల్, డా.సుమన్ శ్రీధర్ తెలిపారు. బోర్డు నిర్దేశించిన ప్రవేశాల గడువు ఈ నెల 7తో ముగియగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 15 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు అధికార వర్గాలు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 16, 2024

సఖి కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

సఖి కేంద్రంలో అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లో సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న వివిధ సేవలకు సంబంధించిన పోస్టర్‌తో పాటు వీడియోను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు సఖి కేంద్రాన్ని సంప్రదిస్తున్నట్లు చెప్పారు. బాధిత మహిళలకు బాసటగా నిలుస్తోందన్నారు.

News October 15, 2024

వరంగల్: మహిళా కానిస్టేబుల్ మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ధరణికి ఇటీవల కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆమెను వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. మంగళవారం తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 15, 2024

సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం: వరంగల్ సీపీ

image

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇకపై పోలీస్‌ సిబ్బంది తమ వ్యక్తిగతం కాని శాఖపరమైన సమస్యలు ఉంటే నోడల్‌ అధికారి ఫోన్‌ నంబర్‌ 9948685494కు తమ ఫిర్యాదులు, సమస్యలను తెలియజేయాల్సి ఉంటుందన్నాన్నారు.