News February 2, 2025
ఇంటర్ ప్రాక్టికల్స్‌ను సజావుగా నిర్వహించాలి : డీఐఈవో

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించనున్న ప్రాక్టికల్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డీఐఈవో జితేందర్ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. శనివారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
జగిత్యాల: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడి భార్యను హత్య చేసిన భర్తకు జగిత్యాల జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి నారాయణ జీవిత ఖైదుతో పాటు రూ.పది వేల జరిమానా విధించారు. మెట్‌పల్లికి చెందిన వాల్గోట్ కిశోర్(32) భార్య నిషిత(28)ను 28-12-2021న ఇంట్లో గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయగా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి శుక్రవారం శిక్షను అమలు చేశారు.
News November 15, 2025
నవంబర్ 15: చరిత్రలో ఈ రోజు

* 1935: నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం
* 1949: నాథూరామ్ గాడ్సే మరణం
* 1982: భారత స్వాతంత్ర్య సమరయోధుడు వినోబా భావే మరణం
* 1986: భారతదేశ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం
* 2022: నటుడు ఘట్టమనేని కృష్ణ మరణం(ఫొటోలో)
* ఝార్ఖండ్ ఫౌండేషన్ డే
News November 15, 2025
బిక్కనూర్: అనారోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ప్రకారం.. బిక్కనూర్‌కు చెందిన తిరుమల రాజయ్య(75) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


