News February 15, 2025
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 89 మంది గైర్హాజరు

జనగామ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 89 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మొదటి సెషన్లో 701 మంది విద్యార్థులకు గాను 67 మంది, రెండో సెషన్లో 520 మంది విద్యార్థులకు గాను 498 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వెల్లడించారు.
Similar News
News December 29, 2025
HNK: ఈనెల 30న డయల్ యువర్ డీఎం

డిపో పరిధిలోని ప్రయాణికులకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడానికి డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. ఇందుకుగాను ప్రయాణికులు ఈనెల 30న ఉదయం 11 నుంచి 12 వరకు 8977781103కి ఫోన్ చేసి తమ విలువైన సూచనలు, సలహాలను అందించి డిపో అభివృద్ధికి సహకరించాలని డీఎం కోరారు.
News December 29, 2025
7 ఏళ్లకే చెస్ ఛాంపియన్.. ఈ చిన్నారి గురించి తెలుసా?

ఏడేళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన ప్రజ్ఞిక గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈ చిన్నారిని రాష్ట్రీయ బాల పురస్కార్ వరించింది. ఈ ఏడాది సెర్బియాలో జరిగిన “FIDE వరల్డ్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్-2025″లో U-7 బాలికల విభాగంలో స్వర్ణం సాధించింది. “నేను బెస్ట్ చెస్ ప్లేయర్ అవుతా” అని ఆమె మోదీతో చెెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఏపీకి చెందిన వీరి ఫ్యామిలీ గుజరాత్లో స్థిరపడింది.
News December 29, 2025
ఖమ్మం: గురుకులాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు దరఖాస్తుల ఆహ్వానం

గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు ప్రవేశ పరీక్ష ప్రకటన గోడ పత్రికను ఆవిష్కరించారు. జనవరి 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బాలికల, బాలుర పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5, 6, 9వ తరగతుల్లో (ఇంగ్లీష్ మీడియం) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.


