News February 15, 2025
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 89 మంది గైర్హాజరు

జనగామ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 89 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మొదటి సెషన్‌లో 701 మంది విద్యార్థులకు గాను 67 మంది, రెండో సెషన్‌లో 520 మంది విద్యార్థులకు గాను 498 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వెల్లడించారు.
Similar News
News March 23, 2025
కత్తెర పట్టుకుంటే రూ.లక్ష ఫీజు తీసుకుంటాడు!

హెయిర్ కట్‌కు సెలూన్ షాప్‌లో ఎంత తీసుకుంటారు? మధ్యతరగతి మనుషులు వెళ్లే సెలూన్లలో రూ.200 లోపే ఉంటుంది. ఎంత లగ్జరీ సెలూన్ అయినా రూ.500-1000 మధ్యలో ఉంటుంది. కానీ ఆలీమ్ హకీమ్ అనే బార్బర్ మాత్రం హెయిర్ కట్ చేస్తే మినిమం రూ.లక్ష తీసుకుంటాడు. మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, రజినీ, ధోనీ, కోహ్లీ.. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలకు ఆయన హెయిర్ స్టైలిస్ట్ మరి. ఒకప్పుడు సాధారణ బార్బరే క్రమేపీ సెలబ్రిటీగా మారాడు.
News March 23, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో అలర్ట్.!

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం నుంచి గురువారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన నివేదికలో వాతావరణ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. సోమవారం నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశము ఉందని నివేదికలో పేర్కొన్నారు.
News March 23, 2025
విశాఖలో సందడి చేసిన చిత్రబృందం

విశాఖలో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రబృందం సందడి చేశారు. ఆదివారం విశాఖలో ఒక హోటల్లో మీడియా సమావేశంలో హీరో ప్రదీప్ మాట్లాడారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఇది సిద్ధమవుతోందన్నారు. వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయని వివరించారు. హీరోయిన్ దీపికా ఉన్నారు.