News February 17, 2025
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షకు అవకాశం

ఫిబ్రవరి 3 నుంచి 22వ తేదీ వరకు జరిగే జనరల్, వొకేషనల్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో ఫీజు కట్టి పరీక్షకు హాజరు కానీ విద్యార్థులకు ఈనెల 18 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణఆదిత్య అనుమతి ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DIEO వెంకటేశ్వరరావు సూచించారు. చుంచుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతుందని ప్రిన్సిపల్ కత్తి రమేష్ చెప్పారు.
Similar News
News November 2, 2025
కామారెడ్డిలో రేపు ప్రజావాణి

కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.
News November 2, 2025
సన్నబియ్యంలో కేంద్రం వాటా రూ.42, రాష్ట్రానిది రూ.15: కిషన్ రెడ్డి

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని సీఎం రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. సన్నబియ్యం స్కీమ్ కేంద్రానిదని, కేజీకి మోదీ సర్కారు రూ.42 ఇస్తే, రాష్ట్రం వాటా రూ.15 మాత్రమే అని పేర్కొన్నారు.
News November 2, 2025
ప్రేమ వివాహం.. పోలీస్ స్టేషన్లో హాజరైన యువతి

రామసముద్రం పోలీస్ స్టేషన్లో నమోదైన యువతి మిస్సింగ్ కేసులో సస్పెన్స్‌కు తెరపడింది. తిరుమల రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరవింద్‌తో ప్రేమ వివాహం చేసుకున్న ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్‌కు హాజరైనట్లు SI రమేష్ బాబు తెలిపారు. అమ్మాయి మేజర్ కావడంతో MRO సమక్షంలో వీడియో, రాతపూర్వకంగా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు SI పేర్కొన్నారు.


