News April 12, 2025

ఇంటర్ ఫలితాలలో కర్నూలు జిల్లా సత్తా

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. కర్నూలు జిల్లాలో సెకండ్ ఇయర్‌లో 18,093 మంది మంది పరీక్షలు రాయగా 14,967 మంది పాసయ్యారు. 83 శాతం పాస్ పర్సంటేజీతో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే 11 వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 20,420 మందికి 14859 మంది పాసయ్యారు. 73 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 8 వ స్థానంలో జిల్లా నిలిచింది.

Similar News

News April 25, 2025

కర్నూలు: 4,348 మందికి జూన్ 1న ఫైనల్ పరీక్ష

image

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు జూన్‌ 1న ఫైనల్‌ పరీక్ష నిర్వహించనున్నారు. కానిస్టేబుల్, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష 2023 జనవరి 22న జరిగింది. అర్హత సాధించిన వారికి గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు కర్నూలులో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అందులో 4,348 మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. వారందరికీ జూన్ 1న మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

News April 25, 2025

కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య!

image

కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. లేబర్ కాలనీకి చెందిన రవి, లక్ష్మీజ్యోతి (39) దంపతుల కుమారుడు భరత్ పదో తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. మనస్తాపం చెందిన తల్లి క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 25, 2025

పంచాయతీరాజ్ పాత్ర కీలకమైంది: కర్నూలు కలెక్టర్

image

గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు.

error: Content is protected !!