News April 13, 2025

ఇంటర్ ఫలితాలలో కావలి విద్యార్థిని సత్తా

image

ఇంటర్ ఫలితాల్లో కావలికి చెందిన షణ్ముఖ ప్రియ సత్తా చాటింది. ఫస్టియర్ MPCలో ఆమె 464 స్కోర్ సాధించింది. దీంతో ఆమెకు స్టేట్ ర్యాంకు వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆమెను అభినందించారు.

Similar News

News April 17, 2025

30న నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం

image

నెల్లూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు సీఈవో విద్యారమ ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. ప్రధానంగా 2024-2025 సంవత్సరానికి సంబంధించి జిల్లా, మండల పరిషత్ సవరణ బడ్జెట్, 2025-2026 అంచనా బడ్జెట్‌పై సమీక్షిస్తామన్నారు.

News April 17, 2025

నెల్లూరులో వ్యభిచారం గుట్టురట్టు

image

నెల్లూరులోని వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన మహిళ నెల్లూరు హరనాథపురం శివారులోని ఓ అపార్ట్‌మెంట్లో ఇంటిని రెంట్‌కు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు దాడి చేశారు. ఆమెతో పాటు విటుడు మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

News April 17, 2025

అలా చేస్తే రూ.10 లక్షల ఫైన్: నెల్లూరు జేసీ

image

కాల్షియం కార్బైడ్ ఉపయోగించి కృత్రిమ పద్ధతిలో పండ్లను మగ్గపెట్టే పండ్ల వ్యాపారులకు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ హెచ్చరించారు. ఏడు శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతోందని, అధికారులు తనిఖీలు వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైనా కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!