News April 12, 2025
ఇంటర్ ఫలితాలలో కాస్త వెనుకబడ్డ నంద్యాల

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నంద్యాల జిల్లాలో సెకండ్ ఇయర్లో 10,665 మంది మంది పరీక్షలు రాయగా 8,374 మంది పాసయ్యారు. 79 శాతం పాస్ పర్సంటేజీతో నంద్యాల రాష్ట్రంలోనే 18వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 13,828 మందికి 8,288 మంది పాసయ్యారు. 60 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 22వ స్థానంలో జిల్లా నిలిచింది.
Similar News
News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
News November 19, 2025
NZB: స్వాధార్ గృహంలో సౌకర్యాలు మెరుగుపరచాలి: సబ్ కలెక్టర్

బోధన్ పట్టణంలోని స్వాధార్ గృహంను సబ్ కలెక్టర్ వికాస్ మహతో మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీవోలతో కలిసి సందర్శించారు. నివాసితుల వసతి, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. తక్షణమే సౌకర్యాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆయన సూచనలు జారీ చేశారు.
News November 19, 2025
ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు: వరంగల్ పోలీసులు

ద్విచక్రవాహనాలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సురక్షిత డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


