News June 24, 2024

ఇంటర్ ఫలితాలు.. గద్వాల ఫస్ట్.. నారాయణపేట లాస్ట్

image

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాయి. ఫస్టియర్‌లో MBNRలో మొత్తం 5933 మంది విద్యార్థులకు 3600(60.66) మంది, GDLలో 2045కి 1244(60.83), NGKLలో 3456కి 1954(56.54), WNPలో 3,512కి 1,965(55.94)NRPTలో 2,487కి 1,242 (49.94) పాసయ్యారు. సెకండియర్‌లో MBNR జిల్లాలో 3,277కి 1,435(43.79), NGKLలో 2,139కి 911 (42.59), NRPTలో 1,648కి 544(33.01), GDLలో 1,158కి 650(56.13), WNPలో 1,818కి 653(35.92) ఉత్తీర్ణులయ్యారు.

Similar News

News October 23, 2025

చలో రాజ్ భవన్: రాచాల యుగంధర్ గౌడ్

image

సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ పొలిటికల్ JAC ఆధ్వర్యంలో భారీ స్థాయిలో “ఛలో రాజ్ భవన్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఉదయం 10:00 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్ భవన్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

News October 23, 2025

నేడే ఫైనల్.. సూపర్ కింగ్స్ ❌ ఛాలెంజర్స్

image

తెలుగు వర్సిటీలో గత నెల రోజులుగా “స్పోర్ట్స్ మీట్-2025” ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు క్రికెట్ విభాగంలో తెలుగువర్సిటీ సూపర్ కింగ్స్(ముస్తాక్) జట్టు, తెలుగువర్సిటీ ఛాలెంజర్స్(వినోద్) జట్టు ఫైనల్‌కు చేరుకున్నాయి. నేడు విఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో ఫైనల్ నిర్వహించనున్నారు. అదేవిధంగా సౌత్ జోన్‌లో పాల్గొన్నందుకు వర్సిటీ క్రీడాకారులకు అథ్లెటిక్స్ నిర్వహించి, ఎంపికలు చేయనున్నారు.

News October 23, 2025

మహబూబ్‌నగర్: నేడు ఉద్యోగ మేళా

image

MBNRలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఉ.10:30- మ.2:00 వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. 3 ప్రైవేట్ సంస్థలలో 370 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, SSC, ఇంటర్, డిగ్రీ ఉండాలన్నారు. అభ్యర్థుల వయసు 18-30 ఉండాలని, ఆధార్, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT.