News April 12, 2024
ఇంటర్ ఫలితాల్లో కర్నూల్, నంద్యాల జిల్లా స్థానాలు

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కర్నూల్ జిల్లా 68% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 10వ స్థానంలో, నంద్యాల 59% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. కర్నూలులో 19818 మందికి 13394 మంది.. నంద్యాలలో 12022 మందికి 7102 మంది పాసయ్యారు. సెకండియర్లో కర్నూల్ 76% ఉత్తీర్ణతతో 12వ స్థానం, నంద్యాల జిల్లా 70% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. కర్నూలులో 17294 మందికి 13210 మంది, నంద్యాలలో 9165 మందికి 6429 మంది పాసయ్యారు.
Similar News
News February 14, 2026
కర్నూలు: ఉద్యోగాల పేరుతో రూ.లక్షల్లో మోసం..వ్యక్తి అరెస్టు

ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసిన ఊటూపల్లి మహేంద్రబాబును కర్నూలు 2 టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నకిలీ నియామక ఉత్తర్వులు పంపించి పలువురిని మోసం చేసినట్టు వారు తెలిపారు. గతంలో పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన కేసులోనూ అతనిపై కేసు నమోదై ఉందన్నారు. ముద్దాయిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ తెలిపారు.
News February 14, 2026
చిప్పగిరి మండలంలో విషాదం

చిప్పగిరి మండలం నంచర్లలో విషాదం చోటుచేసుకుంది. గుడిసె సావిత్రి(34) అనారోగ్యంతో మనస్తాపానికి గురై పురుగు మందు మాత్రలు మింగినట్లు పోలీసులు తెలిపారు. భర్త గమనించి ఆమెను ముందుగా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారన్నారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
News February 13, 2026
పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి: సీఎస్

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆర్ఐవోలు పాల్గొన్నారు.


