News April 13, 2025
ఇంటర్ ఫలితాల్లో తేజ కళాశాల విద్యార్థుల ప్రతిభ

అనంతపురంలోని తేజ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని డైరెక్టర్ తేజరెడ్డి, ఛైర్‌పర్సన్ ఉమాదేవి తెలిపారు. సీనియర్ ఇంటర్‌లో అత్యధికంగా 991 మార్కులు, జూనియర్ ఇంటర్‌లో ఎంపీసీ 465, బైపీసీ 435 మార్కులతోపాటు మరెంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. ఫలితాలపై కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News November 16, 2025
రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 16, 2025
భర్త హత్యాయత్నం ఘటనలో భార్య మృతి

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో అనుమానంతో ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకుంది. రత్నమ్మను కుటుంబసభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
News November 14, 2025
రైలు ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం

పెద్దపప్పూరు మండల పరిధిలోని జూటూరు-కోమలి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ట్రాక్ పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. స్థానికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.


