News April 12, 2025
ఇంటర్ ఫలితాల్లో పిడుగురాళ్ల విద్యార్థికి 978 మార్కులు

పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. శనివారం విడుదల చేసిన సెకండియర్ ఫలితాల్లో యశ్వంత్ అనే విద్యార్థికి 978 మార్కులు వచ్చాయి. ఈ విద్యార్థి పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తన తండ్రి కూలీ పని చేస్తుంటాడు. అనంతరం అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆ విద్యార్థిని అభినందించారు.
Similar News
News November 20, 2025
మెదక్: వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ శ్రీనివాస్ రావు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు.
News November 20, 2025
కాకతీయ వర్సిటీ నుంచి జడ్జికి పీహెచ్డీ పట్టా

హన్మకొండ పట్టణంలోని వడ్డేపల్లికి చెందిన లాడే రాజు కాకతీయ యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం కుషాయిగూడ కోర్టులో సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఆయన, “INDUSTRIAL DISPUTE SETTLEMENT MECHANISM IN INDIA” అనే అంశంపై పరిశోధన చేశారు. ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ పీహెచ్డీని పూర్తి చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది జడ్జి లాడే రాజును అభినందించారు.
News November 20, 2025
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు రాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేయనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్కు బయల్దేరి వెళ్లనున్నారు.


