News April 25, 2024

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన భీంగల్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు

image

భీంగల్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారని ప్రిన్సిపాల్ డాక్టర్ చిరంజీవి తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థిని తుమ్మ సుప్రీక 955, కావ్య 938 మార్కులు సాధించారని చెప్పారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో బైపీసీ విభాగంలో శ్రీపాద వైష్ణవి 935, సారా మహీన్ 926, జుహానాజ్ 911 మార్కులు సాధించారని చెప్పారు.

Similar News

News March 5, 2026

నిజామాబాద్: ముగ్గురికి జైలు.. 26 మందికి భారీ జరిమానా!

image

నిజామాబాద్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన 29 మందికి కోర్టు భారీ జరిమానా, జైలు శిక్ష విధించింది. తనిఖీల్లో పట్టుబడిన వారిని ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిలో 26 మందికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షల జరిమానా విధించారు. పులాంగ్‌కు చెందిన యాదగిరి, గూపన్‌పల్లికి చెందిన రాజేశ్వర్, ఒడ్డట్‌పల్లికి చెందిన నవీన్ కుమార్‌లకు వారం రోజుల జైలు శిక్ష పడింది.

News March 5, 2026

NZB: ఈ మండలాలకు రిపోర్టర్లు కావలెను

image

ఆర్మూర్, ఆలూరు, నందిపేట, డొంకేశ్వర్, మాక్లూర్, జక్రాన్‌పల్లి, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్, ఇందల్వాయి, డిచ్‌పల్లి, రెంజల్, కోటగిరి మండలాలకు Way2Newsలో పని చేసేందుకు అనుభవం కలిగిన రిపోర్టర్లు కావలెను. ఆసక్తి గల వారు <>లింకును క్లిక్ చేసి<<>> నమోదు చేసుకోండి.

News March 5, 2026

నిజామాబాద్: భక్తుల ముంగిటకే భద్రాద్రి తలంబ్రాలు

image

శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి రాములవారి కళ్యాణ తలంబ్రాలను టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవల ద్వారా భక్తుల ఇంటికే చేరవేస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఆనంద్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.151 చెల్లించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే నేరుగా ఇంటి వద్దకే తలంబ్రాలు అందజేస్తామన్నారు. ఉమ్మడి జిల్లా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.