News April 13, 2025
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గిరిపుత్రిక

అల్లూరి జిల్లా పీఎం కోట గ్రామానికి చెందిన కదల నారాయణరెడ్డి, వెంకట లక్ష్మి కుమార్తె హరిచందన ఇంటర్ ఫలితాల్లో 981 మార్కులతో జిల్లాలోనే ఉన్నత స్థానంలో నిలిచింది. వై రామవరంలోని పి. ఎర్రగొండ ఏపీఆర్ కాలేజీ నుంచి ఈ ప్రతిభ కనబరిచింది. గత పదవ తరగతి ఫలితాల్లో కూడా జిల్లాలో టాప్‌లో ఉండడం గమనార్హం. తమ కష్టం ఎంతోమంది గిరిజనులకి ప్రేరణ నిస్తుందని, బంధువులు, గ్రామస్థులు, ఏజెన్సీ వాసులు అభినందనలు తెలిపారు.
Similar News
News April 17, 2025
రాజమండ్రి: తల్లిదండ్రులు ఒక్కటవ్వాలని కుమార్తె సూసైడ్

చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కలిసి ఉండటం చూడలేదు. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులు దూరంగా ఉండటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తన మరణంతోనైనా ఒక్కటిగా ఉండాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. జంగారెడ్డిగూడెంకు చెందిన లేఖశ్రీ 3 ఏళ్ల వయసు నుంచే అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి రవి, తల్లి నాగదుర్గాదేవి రాజమండ్రిలో వేరుగా ఉంటున్నారు. దీంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది.
News April 17, 2025
రిమాండ్ పొడిగింపు.. రాజమండ్రి జైలుకి అనిల్

వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగిస్తూ నరసారావుపేటలోని రెండో అదనపు న్యాయాధికారి గాయ్రతి ఉత్తర్వులు ఇవ్వడంతో అతడిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. సీఎం, Dy.CM, లోకేశ్‌లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
News April 17, 2025
రాజమండ్రి: గోదావరిలో పడి మహిళ మృతి

రాజమండ్రిలోని మార్కండేశ్వర స్వామి గుడి సమీపంలో గోదావరిలో మునిగి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయనగరానికి చెందిన నారాయణమ్మ రాజమండ్రిలోని ఓంశాంతి ఆశ్రమానికి వచ్చి వెళుతుంటుంది. ఈ విధంగా అక్కడికి వచ్చి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి చనిపోయి ఉంటుందన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.