News April 22, 2025

ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో నిర్మల్‌కు 20వ ర్యాంక్

image

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నిర్మల్ జిల్లాలో 58.78% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 20వ స్థానం సాధించినట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. బాలురు 2421 పరీక్షకు హాజరుకాగా 1054 (43.54) ఉత్తీర్ణత సాధించారన్నారు. బాలికలు 3062 పరీక్షరాయగా 2169 (70.84) ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఓవరాల్‌గా 5483 విద్యార్థులు పరీక్ష హాజరుకాగా 3223 విద్యార్థులు 58.78 శాతంతో ఉత్తీర్ణత సాధించారు.

Similar News

News April 23, 2025

సర్కార్ బడిలో మెరిసిన ఆణిముత్యం

image

తాజాగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో పల్నాడు జిల్లా విద్యార్థిని అద్భుతంగా రాణించారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల జడ్పీ పాఠశాల విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదవి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన విద్యార్థినిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ లలిత, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

News April 23, 2025

వరంగల్ చపాటా అంటే నర్సంపేటనే..!

image

చపాటా మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టింది పేరు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది నర్సంపేట నియోజకవర్గంలో మాత్రమే. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చిని మొదట నల్లబెల్లికి చెందిన రైతులు సాగు చేశారు. తర్వాత నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని రైతులు ఈ రకం మిర్చి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వచ్చింది.

News April 23, 2025

BRS పేరు మారుస్తారా? KTR ఏమన్నారంటే?

image

TG: BRS పేరు మార్చాల్సిన అవసరం లేదని, తీరు మార్చుకోవాలని KTR ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. KCR లెజెండ్, కారణజన్ముడు అని పేర్కొన్నారు. KCR కాకుండా తనకు నచ్చిన CM పినరయి విజయన్(కేరళ) అని తెలిపారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, పవన్ కళ్యాణ్ తాను ఊహించిన దానికంటే ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. మోదీ మతపరమైన అజెండాను ప్రచారం చేస్తున్నారని, ఇప్పటివరకు PMగా చేసిందేం లేదని అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!