News April 25, 2024
ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి టాప్
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా తొలి 71.7 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 71,297 మంది పరీక్షలు రాయగా 51,121 మంది పాసయ్యారు. మేడ్చల్ జిల్లా 71.58 శాతంతో 2వ స్థానంలో నిలిచింది. 64,828 మంది పరీక్షలు రాయగా 46,407 మంది పాసయ్యారు. వికారాబాద్ జిల్లా 53.11 శాతంతో 22వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 6,455 మంది పరీక్షలు రాయగా 3,428 మంది ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News February 5, 2025
GHMCలో ఎలక్షన్స్.. నోటిఫికేషన్ విడుదల
GHMCలో స్టాండింగ్ కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఇలంబర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ప్రస్తుత 146 మంది కార్పొరేటర్లలో 15 మంది సభ్యులను ఎన్నుకోవాలి. GHMC హెడ్ ఆఫీస్లో FEB 10 నుంచి 17 నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన పరిశీలన, తుదిజాబితా వెల్లడిస్తారు. 21న ఉపసంహరణ, 25న ఎన్నిక ఉంటుంది. అదే రోజు ఓటింగ్ ముగిశాక లెక్కింపు చేస్తారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది.
News February 5, 2025
కూకట్పల్లిలో 8 మంది మహిళల బైండోవర్
కూకట్పల్లి PS పరిధిలోని భాగ్యనగర్ కాలనీ అల్లూరి ట్రేడ్ సెంటర్ వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది మహిళలను కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సమాచారం అందడంతో వీరిని అదుపులోకి తీసుకొని కూకట్పల్లి తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
News February 4, 2025
HYD: గన్ ప్రాక్టీస్.. కుక్కను చంపిన ప్రభాకర్!
HYD గచ్చిబౌలిలోని ప్రీజం పబ్లో పోలీసులపై కాల్పుల జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గురించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. రూ. 10 లక్షలు పెట్టి 3 గన్లు, 500 బుల్లెట్లు కొన్న ప్రభాకర్.. ప్రాక్టీస్లో భాగంగా ఓ కుక్కను చంపినట్లు తెలుస్తోంది. బిజినెస్ అంటూ బిల్డప్ ఇస్తూ HYDలో మకాం వేశాడు. తాజాగా కాల్పులు జరిపి దొరికిపోయాడు. నిందితుడిని కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది.