News April 25, 2024
ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి టాప్

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 71.7 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 71,297 మంది పరీక్షలు రాయగా 51,121 మంది పాసయ్యారు. మేడ్చల్ జిల్లా 71.58 శాతంతో 2వ స్థానంలో నిలిచింది. 64,828 మంది పరీక్షలు రాయగా 46,407 మంది పాసయ్యారు. వికారాబాద్ జిల్లా 53.11 శాతంతో 22వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 6,455 మంది పరీక్షలు రాయగా 3,428 మంది ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News September 18, 2025
ఈనెల 22 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ ఇంటర్ పరీక్షలు

జిల్లాలో టాస్క్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, TG ఓపెన్ స్కూలింగ్ సొసైటీ (TOSS) SSC & ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు.
News September 17, 2025
పేట్ల బురుజులో పోలీసుల శిశు సంరక్షణ కేంద్రం

మహిళా పోలీసుల కోసం నూతన శిశు సంరక్షణ కేంద్రాన్ని నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ బుధవారం ప్రారంభించారు. పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో మహిళా పోలీసు అధికారుల పిల్లల కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 150-200 మంది పిల్లలకు ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళా ఉద్యోగులు తమ పిల్లలను డ్యూటీ ప్రదేశానికి తీసుకువస్తే వారి సంరక్షణకు ఈ కేంద్రం ఎంతో భరోసా ఇస్తుందన్నారు.
News September 17, 2025
బేగంపేట ఎయిర్పోర్టులో రాజ్నాథ్కు వీడ్కోలు

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. పర్యటన అనంతరం తిరిగి ఢిల్లీ వెళుతున్న సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో కిషన్ రెడ్డి, రాష్ట్ర BJP అధ్యక్షుడు రామచంద్ర రావు, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో DCP రష్మీ పెరుమల్, డిఫెన్స్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.