News April 25, 2024
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో హైదరాబాద్ ఇలా..

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో హైదరాబాద్ 3 జోన్లు 7, 10, 12వ స్థానంలో నిలిచాయి. HYD-1 జోన్ 62.14 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 28,728 మంది పరీక్షలు రాయగా 17,852 మంది పాసయ్యారు. HYD-2వ జోన్ 59.06 శాతంతో 10వ స్థానంలో నిలిచింది. 35,155 మంది పరీక్షలు రాయగా 20,764 మంది పాసయ్యారు. HYD-3వ జోన్ 58.52 శాతంతో 12వ స్థానంలో నిలిచింది. 12,698 మంది పరీక్షలు రాయగా 7,431 మంది ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News January 5, 2026
RR: గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేశారా?

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నూతన, 6- 9 తరగతుల వరకు మిగిలిన సీట్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు శంషాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి.నాగేశ్వరరావు తెలియజేశారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులన్నారు. ఈ నెల 21లోపు కుల,ఆదాయం, బర్త్ సర్టిఫికెట్, 2 ఫొటోలు తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
News January 4, 2026
ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

చేవెళ్లలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాలుర బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు చెన్నయ్యగౌడ్ మాట్లాడుతూ.. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను 2 జట్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 10, 11న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని వెల్లడించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలన్నారు.
News January 2, 2026
HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్లైన్ శిక్షణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్వేర్ కోర్సులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.


