News December 23, 2024
ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ పథకం

2025 మార్చి నెలలో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్థులు సౌకర్యార్థం ఈనెల 24 నుంచి 31 తేదీ వరకు తత్కాల్ పథకంలో చెల్లించవచ్చునని ఆర్ఐఓ డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. 3000 రూపాయల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాల్సిందిగా ఆయన కోరారు.
Similar News
News January 6, 2026
సూళ్లూరుపేట: ఇది ప్రకృతి హీరో..!

ఉప్పునీరు, చిత్తడి నేలలతో పులికాట్ జీవాన్ని దాచుకుంటుంది. ఆ జీవాన్ని ముందుగా గుర్తించేది నల్ల తల కొంగే. చెరువు అంచుల్లో పురుగులు, చిన్న జీవులను తింటూ పొలాలకు కనిపించని రక్షణ ఇస్తుంది. ఈ పక్షి లేకపోతే పురుగులు పెరుగుతాయి, పంట సమతుల్యత కోల్పోతుంది. మనుషులు గమనించకపోయినా, నల్ల తల కొంగ పులికాట్ జీవచక్రాన్ని నిలబెడుతుంది. అందుకే ఇది శబ్దంతో కాదు, అవసరంతో ప్రకృతి హీరో అవుతుంది.
#FLEMMINGOFESTIVAL
News January 6, 2026
నెల్లూరు: తెల్లవారుజామున రైలు కింద పడి సూసైడ్

మనుబోలు- గూడూరు రైల్వే స్టేషన్ మధ్య చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో మూడో రైల్వే లైన్పై మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వయస్సు 45-50 ఉంటుందని రైల్వే ఎస్ఐ హరిచందన తెలిపారు. మృతుడు పచ్చ రంగు ఫుల్ హాండ్స్ షర్టు బులుగు రంగు గళ్ల లుంగి ధరించి ఉన్నాడు. కుడి చేతికి ఎర్రని దారం కట్టుకొని ఉన్నాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 6, 2026
కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు EPFO తప్పనిసరి : కలెక్టర్

నూతనంగా ఉద్యోగంలో చేరిన కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో వచ్చే విధంగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం వారి ఛాంబర్లో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PM-VBRY) అమలుపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పని చేస్తున్న కార్మికులను తప్పనిసరిగా EPFO పరిధిలో నమోదు చేయాలన్నారు.


