News February 19, 2025

ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు నిర్మల్ కలెక్టర్ స్వాగతం

image

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థల సేకరణపై బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్ మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణా ఆదిత్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమొక్కను అందించి స్వాగతం పలికారు. ఆమెతో పాటు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఉన్నారు.

Similar News

News March 23, 2025

నంద్యాలలో వార్డెన్‌పై పోక్సో కేసు

image

నంద్యాలలోని ఓ స్కూల్ హాస్టల్ వార్డెన్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరిట మాయమాటలతో మభ్యపెట్టి.. బాలికను తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 23, 2025

వచ్చే నెలలో కెనడాలో ఎన్నికలు

image

కెనడాలోని 338 పార్లమెంటు స్థానాలకు వచ్చే నెల 28న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త ప్రధాని కార్నీ త్వరలోనే ప్రకటన విడుదల చేయొచ్చని తెలుస్తోంది. కొత్త నాయకత్వం వచ్చాక అధికార లిబరల్ పార్టీవైపు ప్రజామోదం ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పీఎం కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు సమాచారం.

News March 23, 2025

అంతర్జాతీయ పోటీలకు నిజామాబాద్ విద్యార్థిని ఎంపిక

image

భారత అండర్-15 సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థిని ఎంపికైంది. ఈ నెల 25వ తేదీ నుంచి 30 వరకు తైవాన్‌లో జరిగే సాఫ్ట్ బాల్ పోటీల్లో డిచ్‌పల్లి మండలం సుద్దులం గురుకుల పాఠశాలకు చెందిన గన్న హర్షిని పాల్గొననుంది. ఈ సందర్భంగా క్రీడాకారిణిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినోద్, తిరుపతి పాల్గొన్నారు.

error: Content is protected !!