News April 12, 2025
ఇంటర్ రిజల్ట్స్.. అన్నమయ్య జిల్లాకు 14వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకెండ్ ఇయర్లో 11486 మంది పరీక్షలు రాయగా.. 9175 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలోనే 14వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 13108 మందికి, 7814 మంది పాసయ్యారు. 60 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 23వ స్థానంలో అన్నమయ్య జిల్లా నిలిచింది.
Similar News
News December 8, 2025
సూపర్ ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటకపై సూపర్ ఓవర్లో త్రిపుర థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత కర్ణాటక 20 ఓవర్లలో 197/6 స్కోర్ చేయగా, త్రిపుర 197/8 చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్లో TRI 22 రన్స్ చేయగా, KA 18/1 స్కోర్ మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. త్రిపుర కెప్టెన్ మణిశంకర్ ఆల్రౌండ్(35 బంతుల్లో 69 పరుగులు, 2 వికెట్లు; సూపర్ ఓవర్లో 5 రన్స్, 1 వికెట్) ప్రదర్శనతో అదరగొట్టారు.
News December 8, 2025
AI నియంత్రణపై ఆస్ట్రేలియా ఫోకస్..

16 ఏళ్లలోపువారు SM వాడటంపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా ఇప్పుడు AI నియంత్రణపై దృష్టి పెట్టింది. కొత్త చట్టాలు చేయకుండా, అమలులో ఉన్న చట్టాలతోనే AIతో వచ్చే సమస్యల పరిష్కారానికి 2026 నాటికి భద్రతా సంస్థ ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ అభివృద్ధితో పెరుగుతున్న సమస్యల పరిష్కారానికి సంస్థ పనిచేస్తుంది. డేటా సెంటర్లకు పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యాభివృద్ధి, ప్రజాభద్రత టార్గెట్గా పెట్టుకున్నట్టు చెప్పింది.
News December 8, 2025
కాకినాడ: రూ.కోటి దోచేసిన వారిపై చర్యలేవీ..?

డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ముకు భద్రత కరవైంది. కరప(M) కూరాడలో సుమారు రూ. కోటి నిధులు స్వాహా అవ్వగా కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి, ఉన్నతాధికారులు తప్పించుకుంటున్నారని మహిళలు మండిపడుతున్నారు. రాజకీయ జోక్యం, పీడీల మామూళ్ల పర్వంతో ఈ వ్యవస్థ అవినీతికి నిలయంగా మారిందని వాపోతున్నారు. కలెక్టర్ పారదర్శకంగా విచారణ జరిపి తమ సొమ్ము రికవరీ చేయాలని వారు కోరుతున్నారు.


