News April 12, 2025

ఇంటర్ రిజల్ట్స్.. విశాఖకు 4వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో విశాఖ విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 40,098 మంది పరీక్షలు రాయగా 31,866 మంది ఉత్తీర్ణులయ్యారు. 79% పాస్ పర్సంటేజీతో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 36,479 మందికి 31,761 మంది పాస్ కాగా 87% పాస్ పర్సంటేజీతో 6వ స్థానంలో నిలిచింది.

Similar News

News March 13, 2026

వివాదాస్పద ఖర్చుల చెల్లింపులకూ గ్రీన్ సిగ్నల్(2/2)

image

ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ కోసం రాళ్లు తరలింపు, యోగాంధ్ర కార్యక్రమంలో వినియోగించిన వీఐపీ మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులు జీవీఎంసీ సమావేశంలో అంగీకరించారు. కూర్మన్నపాలెం ఎంవీవీ ఎంకే పార్కుకు నీటి సరఫరా పైపులకు రూ.46.60 లక్షలు, ట్యాంకర్ల బిల్లులకు రూ.19.20 లక్షలు, ఫాగింగ్‌కు రూ.80 లక్షలు, వీధి కుక్కల శస్త్రచికిత్సలకు రూ.45 లక్షల చెల్లించెందుకు ఆమోదం తెలిపారు.

News March 13, 2026

జీవీఎంసీ చివరి సమావేశం.. వివాదస్పద నిర్ణయాలకు ఆమోదం(1/2)

image

జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో ప్రధాన అజెండాలోని 193 అంశాలతో పాటు టేబుల్ అజెండా కలిపి మొత్తం 294 అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 293 అంశాలను సభ్యులు ఆమోదించారు. గతంలో వివాదాస్పదంగా మారి వాయిదా పడిన ప్రతిపాదనలకూ స్వల్ప చర్చతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాలుగు రోజుల్లో పాలకవర్గ గడువు ముగియనున్న నేపథ్యంలో అవినీతికి ఆస్కారం ఉన్న అంశాలనూ అడ్డుకోకుండా ఆమోదించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News March 13, 2026

విశాఖ: బుకింగ్ చేసినా ఆలస్యంగా గ్యాస్ డెలివరీ..!

image

విశాఖలో గ్యాస్ సరఫరా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా సుమారు 9 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు 26,000 నుంచి 30,000 సిలిండర్లు డెలివరీ అయ్యేవి. అయితే ప్రస్తుతం రోజువారీ సరఫరా 16,000 నుంచి 19,000 సిలిండర్లకు తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో సిలిండర్ 24 గంటల్లో అందుతుండగా, ప్రస్తుతం వినియోగదారులు 7 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.