News April 12, 2025

ఇంటర్ రిజల్ట్స్.. 12 వ స్థానంలో విజయనగరం జిల్లా

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో విజయనగరం జిల్లాలో 17,636 మందికి 11,525 మంది పాసయ్యారు. 65 శాతం పాస్ పర్సంటేజీతో ఫస్ట్ ఇయర్‌లో రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 15,512 మంది పరీక్షలు రాయగా 12,340 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో విజయనగరం జిల్లా 15వ స్థానంలో నిలిచింది.

Similar News

News April 15, 2025

VZM: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్టు

image

విజయనగరం పట్టణంలోని స్థానిక ఫైర్ స్టేషన్ సమీపంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉల్లి వీధికి చెందిన బూర్లి వాసును అదుపులోకి తీసుకొని విచారించగా అతని సమాచారంతో బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశామన్నారు.

News April 13, 2025

రేగిడి: చెట్టును ఢీకొన్న టిప్పర్.. డ్రైవర్ దుర్మరణం

image

ఇసుక లోడింగ్ కోసం వెళ్తున్న టిప్పర్ రేగిడి (M) రెడ్డి పేట సెంటర్ వద్ద ఆదివారం ఉదయం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో అనకాపల్లికి చెందిన డ్రైవర్ నాగరాజు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తనను కాపాడాలంటూ చేసిన ఆర్తనాదాలతో తోటి డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాగరాజును బయటికి తీసేందుకు ప్రయత్నించగా అప్పటికే చనిపోయాడు.

News April 13, 2025

కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కొత్తవలస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన సర్వసిద్ధి వినయ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో శనివారం రాత్రి మృతి చెందాడు. వాహనం బలంగా ఢీకొనడంతో అవయవాలు రోడ్డుపై పడి భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ (27)కి 2023లో వివాహం జరిగింది.

error: Content is protected !!