News February 3, 2025
ఇంటర్ విద్యార్థినిపై తిరుపతి లెక్చరర్ అత్యాచారం

ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటన ఇది. ప.గో(D) కొవ్వూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో తిరుపతికి చెందిన వినయ్‌వర్ధన్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 28న ఆమెను విజయవాడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతపురం, ఇతర ప్రాంతాల్లో తిరిగి భీమవరం వచ్చారు. తర్వాత అమ్మాయిని ఇంటికి పంపేయగా.. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News March 14, 2025
MBNR: విపత్తుల నివారణకు 300 మంది వాలంటీర్లు: జిల్లా కలెక్టర్

సహజ మానవ కల్పిత విపత్తులను నివారించేందుకు 300 మంది వాలంటీర్లను నియమించినట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. గురువారం ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రకృతి మానవ కల్పిత విపత్తులు జరిగినప్పుడు అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే లోగా పౌరులే స్వయంరక్షణ పద్ధతులను పాటిస్తూ ఇతరుల ప్రాణాలను, ఆస్తి నష్టాలు కాకుండా ఏ విధంగా నివారించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
News March 14, 2025
GWL: ‘ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి’

హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకు ఒకసారి పకడ్బందీగా అప్ డేట్ కావాలని, నూతనంగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు.
News March 14, 2025
NTR: ప్రణాళికతో ధాన్యం సేకరణకు సిద్ధంకండి- కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విజయవంతంగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయిందని, ఇదే విధంగా రబీ (2024-25) సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్, రహిత డిజిటల్ లావాదేవీలు తదితరాలపై వర్చువల్ సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.