News February 3, 2025

ఇంటర్ విద్యార్థినిపై తిరుపతి లెక్చరర్ అత్యాచారం

image

ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం చేసిన ఘటన ఇది. ప.గో(D) కొవ్వూరుకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. అదే కాలేజీలో తిరుపతికి చెందిన వినయ్‌వర్ధన్ జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గతనెల 28న ఆమెను విజయవాడ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతపురం, ఇతర ప్రాంతాల్లో తిరిగి భీమవరం వచ్చారు. తర్వాత అమ్మాయిని ఇంటికి పంపేయగా.. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News February 14, 2025

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: CM చంద్రబాబు

image

AP: అన్నమయ్య జిల్లాలో యువతిపై జరిగిన <<15457778>>యాసిడ్ దాడి<<>>ని CM చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువతికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే, ఈ ఘటనపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన సైకోను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. భవిష్యత్తులో మరో చెల్లిపై దాడి జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు.

News February 14, 2025

YCP మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు

image

AP: దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కారు అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బుధవారం రాత్రి ఓ వివాహ కార్యక్రమంలో ఘర్షణ జరిగిందని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 14, 2025

వివాదాస్పద కామెంట్స్.. సుప్రీంకు యూట్యూబర్

image

పేరెంట్స్ సెక్స్‌పై కామెంట్స్ <<15413969>>వివాదంలో<<>> తనపై నమోదైన FIRలను క్వాష్ చేయాలంటూ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. త్వరగా విచారించడం కుదరని, ప్రొసీజర్ ప్రకారమే చేపడతామని చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా స్పష్టం చేశారు. కాగా షెడ్యూల్ ప్రకారం రణ్‌వీర్ పిటిషన్ విచారణకు రావడానికి రెండు, మూడు రోజులు పట్టనుంది.

error: Content is protected !!