News March 4, 2025

ఇంటర్ విద్యార్థులకు డీఐఈఓ కీలక సూచన

image

నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఐఈఓ దస్రు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా కాపీయింగ్‌కు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 4, 2025

నల్గొండ: ఇంటర్ పరీక్షలకుసర్వం సిద్ధం: డీఐఈఓ

image

రేపటి నుంచి ప్రారంభంమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని డీఐఈఓ దశ్రు నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

News March 4, 2025

నల్గొండ: పోలీసులకు ఎస్పీ స్ర్టాంగ్ వార్నింగ్..

image

నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు మూసీ పరివాహక ప్రాంతంలో మంగళవారం జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వెయ్యాలని పోలీసులను ఆదేశించారు. అమ్మనబోలులో ఇవాళ నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రతి వాహనం వివరాలు నమోదు చేయాలన్నారు. అక్రమ ఇసుక తరలించేవారికి సహకరించే పోలీసులు, అధికారులపైనా చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.

News March 4, 2025

నల్గొండలో రేపు మంత్రి కోమటిరెడ్డి పర్యటన

image

జిల్లాలో రేపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించనున్నారు. ఉ.8గంటలకు HYD నుంచి బయలుదేరి ఉ.10గంటలకు కనగల్ మండలం చేరుకుంటారు. కనగల్ పట్టణంలో నిర్మించిన కొత్త PHCని ప్రారంభిస్తారు. అనంతరం సెంటర్ ఫర్ లైఫ్ సైన్సెస్, మహీంద్రా యూనివర్సిటీల సహకారంతో చేస్తున్న గ్లకోమా పైలెట్ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవలో పాల్గొంటారు. కస్తూర్భా పాఠశాలను సందర్శిస్తారు. మ.1:15కు నల్గొండలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

error: Content is protected !!