News May 22, 2024
ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక బస్సులు: వీరయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు జరిగే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.వీరయ్య చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
Similar News
News February 24, 2026
BREAKING: భీమవరంలో ACBకి చిక్కిన ఫారెస్ట్ అధికారి

భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు జరిపిన దాడులు కలకలం రేపాయి. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక పనికి సంబంధించి బాధితుడి నుంచి నగదు డిమాండ్ చేయడంతో అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
News February 24, 2026
పాలకొల్లు: మళ్లీ ‘ఫ్యాన్’ కిందకే మేకా.. సస్పెన్షన్ ఎత్తివేత?

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారు. తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్‌ని ఆయన తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 9న జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరుకావాల్సిందిగా జగన్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో శేషుబాబుపై గతంలో ఉన్న సస్పెన్షన్‌ను అధిష్ఠానం ఎత్తివేసినట్లు తెలుస్తోంది.
News February 24, 2026
పీజీఆర్ఎస్‌కు 19 అర్జీలు: ఎస్పీ

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.


