News March 5, 2025

ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి: మంత్రి సీతక్క

image

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. బంగారు భవిష్యత్తుకు మరో అడుగు వేస్తున్న తరుణంలో లక్ష్యంపైనే విద్యార్థులు గురి పెట్టి ఉత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 3, 2025

ఆసిఫాబాద్: 7 మద్యం షాపులకు.. రేపే లక్కీ డ్రా

image

ఆసిఫాబాద్ జిల్లాలో మిగిలిన 7 మద్యం దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ASF జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. జిల్లాలో 32 మద్యం దుకాణాలకు అక్టోబర్ 27న 25 మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. 7 షాపులకు డబల్ డిజిట్ రానందున వాయిదా వేశారు. వాయిదా వేసిన షాపులకు రేపు లక్కీ డ్రా నిర్వహించనున్నారు.

News November 2, 2025

బిగ్‌బాస్: దువ్వాడ మాధురి ఎలిమినేట్

image

బిగ్‌బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ ప్రక్రియలో మాధురి, సంజన, రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్‌లు ఉన్నారు. ఆడియన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన మాధురి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

News November 2, 2025

హైడ్రాలో BRS అనుకూల అధికారులు: జగ్గారెడ్డి

image

TG: హైడ్రాపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి BRSకు లాభం కలిగేలా చూస్తున్నారనే అనుమానం ఉందన్నారు. ‘హైడ్రా అంశాన్ని తెరపైకి తెచ్చి జూబ్లీహిల్స్‌లో నవీన్‌ను ఓడించే కుట్ర జరుగుతోంది. ఎన్నికలప్పుడే KTRకు హైడ్రా ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్పాలి. BRS అనుకూల హైడ్రా అధికారుల వల్ల ఎవరైనా నష్టపోతే CM రేవంత్ దృష్టికి తీసుకెళ్తా’ అని చెప్పారు.