News June 18, 2024
ఇంటర్ సప్లిమెంటరీలో ప్రకాశం జిల్లాకు 12వ స్థానం

కాసేపటి క్రితం ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రకాశం జిల్లాలో 5,487 మంది పరీక్షలు రాయగా… 3330 మంది పాసయ్యారు. మొత్తం 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా .. జిల్లా 12వ స్థానంలో నిలిచింది. దాంతో పాటు ఒకేషనల్‌కు ప్రకాశం జిల్లాలో 862 మంది పరీక్ష రాయగా 534 మంది పాసయ్యారు. ఇందులో జిల్లా 62 శాతం ఉత్తీర్ణత సాధించింది.
Similar News
News November 20, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.
News November 20, 2025
ప్రొద్దుటూరు: మొబైల్ చూస్తూ డ్రైవింగ్.. మరణానికి నాంది!

మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అలాగే మృత్యువుకు దారి వేసినట్లేనని ప్రకాశం పోలీస్ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయరాదని, అటువంటి వారికి రూ.2 వేల జరిమానా లేక ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.
News November 20, 2025
మందుబాబులకు.. ప్రకాశం పోలీస్ డిఫరెంట్ కౌన్సిలింగ్!

టంగుటూరు లోని రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతూ చెత్తాచెదారం పోగుచేసిన పలువురికి పోలీసులు భిన్న రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురు రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతుండగా ఎస్సై నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గతంలో ఇదే ప్రదేశాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు క్లీన్ చేశారు. మందుబాబులు అదే ప్రదేశంలో చెత్త వేయడంతో వారి చేతనే పోలీసులు క్లీన్ చేయించారు.


