News June 26, 2024

ఇంటర్ సప్లిమెంటరీలో ప్రకాశం జిల్లాకు 14వ స్థానం

image

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రకాశం జిల్లాలో 6,445 మంది పరీక్షలు రాయగా.. 2,709 మంది పాసయ్యారు. మొత్తం 42% మంది ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రంలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. అలాగే బాపట్లలో 2,782 మంది రాయగా.. 1,119 మంది పాసయ్యారు. 40% ఉత్తీర్ణులవ్వగా.. జిల్లా 20వ స్థానంలో నిలిచింది. దాంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఒకేషనల్‌కు 884 మంది పరీక్ష రాయగా 442 మంది పాసయ్యారు.

Similar News

News October 15, 2025

ప్రకాశం జిల్లాలో 38,866 ఎకరాల భూమి.. ఆలయాల పరిధిలోనే!

image

జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దేవదాయ శాఖ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ఏసీ పానకాలరావు మాట్లాడుతూ.. జిల్లాలో దేవదాయ శాఖ పరిధికి సంబంధించి 1001 దేవాలయాలు ఉన్నాయని, వీటి పరిధిలో 38,866.95 ఎకరాల భూమి ఉందన్నారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.

News October 15, 2025

ఒంగోలులో వ్యక్తి మిస్సింగ్.. ఎక్కడైనా చూశారా..!

image

ఒంగోలు పరిధిలోని శ్రీనగర్ కాలనీ ఒకటవ లైన్‌లో ఉండే భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి (దేవుడు) ఆదివారం మిస్ అయినట్లు ఒంగోలు తాలూకా PSలో ఫిర్యాదు అందింది. మిస్ అయిన వ్యక్తి భార్య వివరాల ప్రకారం.. పొన్నలూరు మండలం కొత్తపాలెంకి చెందిన శ్రీనివాసరెడ్డి ఒంగోలులో స్థిరపడ్డారు. కాగా ఆదివారం బ్యాంక్‌లో క్రాఫ్‌లోన్ కట్టేందుకు స్వగ్రామానికి వెళ్లున్నానని వెళ్లాడన్నారు. వివరాలు తెలిస్తే 9177688912కు కాల్ చేయాలన్నారు.

News October 15, 2025

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం అంటే జాగ్రత్త.!

image

డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మిమ్మల్ని సైబర్ నేరగాళ్లు మోసగించే అవకాశాలు ఎక్కువ అంటూ హెచ్చరిస్తున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే మంగళవారం ఓ ప్రకటనను పోలీసులు విడుదల చేశారు. తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభాలు వస్తాయని వచ్చే మెసేజ్లపట్ల ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.