News May 3, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

image

ఈనెల 4 వరకు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించుకునేందుకు బోర్డు గడువు పెంచిందని డీఐఈఓ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2 వరకు ఉన్న ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుంలేకుండా 4 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 8, 2025

TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కొండల్ రెడ్డి

image

తెలంగాణ గణిత ఫోరం మెదక్ జిల్లా నూతన శాఖ ఏర్పడింది. TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బి .కొండల్ రెడ్డి (జడ్పీహెచ్ఎస్ కూచన్‌పల్లి పాఠశాల), ప్రధాన కార్యదర్శిగా గోపాల్ (జడ్పిహెచ్ఎస్ ఝాన్సీ లింగాపూర్), కోశాధికారిగా శివ్వ నాగరాజు (శంకరంపేట(R)), ఉపాధ్యక్షుడిగా బాలరాజు (జడ్పీహెచ్ఎస్ కుర్తివాడ) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గౌరవ అధ్యక్షుడు సదన్ కుమార్ తెలిపారు.

News November 8, 2025

మెదక్ జిల్లాలో 14,15 తేదీల్లో కవిత పర్యటన

image

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత ఈనెల 14, 15 తేదీల్లో మెదక్ జిల్లాలో పర్యటించానున్నారు. 14న మెదక్ జిల్లా శివంపేట నుంచి పర్యటన ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి నర్సాపూర్, కౌడిపల్లి, కుల్చారం మీదుగా మెదక్ పట్టణానికి చేరుకుంటారు. 15న మెదక్ పట్టణం నుంచి ఏడుపాయల సందర్శిస్తారు. పలు సందర్శన అనంతరం మెదక్‌లో మేధావుల సమావేశంలో పాల్గొంటారు. కేవల్ కిషన్ సమాధి సందర్శించనున్నారు.

News November 8, 2025

మెదక్‌లో 5,857 ఇందిరమ్మ ఇళ్ల పనులు షురూ

image

మెదక్ జిల్లాలో మంజూరైన 9,181 ఇందిరమ్మ ఇళ్లలో 5,857 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. ఇంకా 3,324 ఇళ్ల పనులు మొదలుకాలేదన్నారు. ఇప్పటివరకు వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు రూ. 45 కోట్లు చెల్లించినట్లు వివరించారు. 400 అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్న లబ్ధిదారులుపై అంతస్తులో కూడా ఇల్లు నిర్మించుకోవచ్చని ఆయన సూచించారు. బేస్‌మెంట్, స్లాబ్ స్థాయిలో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.