News April 25, 2024
ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు ముఖ్య గమనిక
మేలో జరిగే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు బుధవారం తుది గడువు అని అనంతపురం జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, డిఈఓ వెంకటరమణ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని సంబంధిత జూనియర్ కళాశాలలో ఫీజు చెల్లించాలని సూచించారు. ఫీజు మొత్తాన్ని ఆన్లైన్‌లో మాత్రమే చెల్లించాలని స్పష్టం చేశారు.
Similar News
News January 16, 2025
పారదర్శకంగా కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు: ఎస్పీ
అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో గురువారం ఉదయం ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఎస్పీ జగదీశ్ పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
News January 16, 2025
కశ్మీర్‌లో ప్రాణాలొదిలిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్
ధర్మవరానికి చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకట రమణారెడ్డి (40) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కశ్మీర్ బార్డర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో గుండెపోటుకు గురై మృతి చెందారు. ఇవాళ మృతదేహాన్ని బసినేపల్లికి తీసుకురానున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
News January 16, 2025
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ విజయోత్సవ వేడుక!
హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈనెల 12న రిలీజైన ఈ మూవీ తొలిరోజే రూ.56కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీ విజయోత్సవ వేడుకలను అనంతపురంలో నిర్వహించేందకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి ఘటన కారణంగా అనంతలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో విజయోత్సవ వేడుకలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.