News April 25, 2024

ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మేడ్చల్ సెకండ్

image

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 79.31 శాతంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. 58,933 మంది పరీక్షలు రాయగా 46,742 మంది పాసయ్యారు. రంగారెడ్డి జిల్లా 77.63 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. 64,759 మంది పరీక్షలు రాయగా 50,273 మంది పాసయ్యారు. వికారాబాద్ జిల్లా 61.42 శాతంతో 27వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 6,456 మంది పరీక్షలు రాయగా 3,965 మంది ఉత్తీర్ణత సాధించారు.

Similar News

News October 2, 2024

HYD: బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త!

image

HYDలో బైకులు ఎత్తుకుపోతున్నట్లు నిత్యం కేసులు నమోదవుతున్నాయి. కాగా ఘరానా దొంగలే కాకుండా జల్సాలకు అలవాటు పడ్డ కొందరు యువకులు ఈ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఉప్పల్, అంబర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, అఫ్జల్‌గంజ్‌, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, యాచారం, మంచాల ఇళ్ల ముందు బైకులు ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు. పండగలకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.

News October 1, 2024

HYD: ‘దళితుడిని వీసీగా నియమించాలి’

image

తెలుగు విశ్వవిద్యాలయానికి ఇంతవరకు దళితుడిని వీసీగా నియమించలేదని మంగళవారం దళిత బహుజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో మాట్లాడుతూ.. బీసీ, ఓసీ, బ్రాహ్మణులు వీసీలుగా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి ఇప్పుడు తమ బహుజనులను నియమించాలని సీఎంను కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమ నాయకుడు ఆచార్య బన్న అయిలయ్యను వీసీగా నియమించాలని ఈ సందర్భంగా సూచించారు.

News October 1, 2024

రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

రంగారెడ్డి జిల్లా కోర్టులో లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు అయ్యింది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు రంగారెడ్డి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే జానీ మాస్టర్‌ను 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు. జానీ మాస్టర్‌ఫై అత్యాచార కేసుతో పాటు ఫోక్సో కేసు నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు.