News August 2, 2024
ఇంటింటా ఇన్నోవేటర్ 2024′ దరఖాస్తు గడువు పొడగింపు

ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకునే గడువును ఆగస్ట్ 10 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రకటించింది. ఆవిష్కర్తలు, అంకురాలకు, వ్యవస్థాపకులకు సమ్మిళిత ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొదటి ప్రతిస్పందనగా గుర్తించబడిందని ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ అన్నారు.
Similar News
News December 1, 2025
మెదక్: ప్రజావాణిలో 8 ఫిర్యాదులు

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు 8 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యలు విని, వెంటనే చర్యలు తీసుకోవాలని సీఐలు, ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు పైరవీలు లేకుండా పోలీసులను సంప్రదించాలని, చట్టపరమైన న్యాయం అందించడం తమ బాధ్యతని ఎస్పీ తెలిపారు.
News December 1, 2025
మెదక్: నామినేషన్ల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసేందుకు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. మెదక్, శంకరంపేట్–ఆర్, రామాయంపేట్ ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ కేంద్రాల భద్రత, బందోబస్తు, పర్యవేక్షణ వ్యవస్థలను సమీక్షించారు. రద్దీ నియంత్రణ, శాంతిభద్రతలు కఠినంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. SP వెంట డీఎస్పీ నరేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
News December 1, 2025
MDK: అభ్యర్థులకు కొత్త బ్యాంక్ ఖాతా తప్పనిసరి: కలెక్టర్

స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంక్ ఖాతా తెరవాలని, అన్ని లావాదేవీలు ఆ ఖాతా ద్వారా జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని, పాత కుల సర్టిఫికెట్ కూడా చెల్లుబాటు అవుతుందని అన్నారు. సమస్యల కోసం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.


