News August 16, 2024
ఇంటింటా ఇన్నోవేషన్.. 19 ప్రాజెక్టులు ఎంపిక
వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వారిలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి కేవలం 30 మంది దరఖాస్తులు చేసుకోగా ఇందులో 19 ప్రాజెక్టులను ఎంపికచేశారు. నిన్న ఆయా జిల్లాల కలెక్టర్ల చేతుల మీదుగా వారు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. వీరికి పేటెంట్ హక్కులు కూడా కల్పించనున్నారు. గద్వాల జిల్లాలో పదికి 3 ప్రాజెక్టులు ఎంపిక చేశారు.
Similar News
News November 28, 2024
MBNR: నూనెపడి విద్యార్థినికి గాయాలు.. స్పెషల్ ఆఫీసర్ సస్పెన్షన్
నవాబ్‌పేటలోని కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి <<14727126>>విద్యార్థిని జల్సా <<>>పై వేడి నూనెపడి గాయాలైన గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తహాశీల్దార్ శ్రీనివాసులును విచారణకు ఆదేశించారు. తహశీల్దార్ నివేదిక ఆధారంగా పాఠశాల ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. విచారణ సమయంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ల కూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News November 28, 2024
MBNR: నేడు పాలమూరుకు మంత్రులు రాక
MBNR జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురువారం ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
News November 28, 2024
MBNR: GET READY.. రేపటి నుంచి రైతు పండుగ
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ మైదానంలో గురువారం నుంచి మూడు రోజులపాటు “రైతు పండుగ” ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. రైతులకు అవగాహన కల్పించేలా సంబంధిత శాఖల ఆధ్వర్యంలో 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. బుధవారం రైతు పండుగ సభకు సంబంధించిన పలు అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.